టాలీవుడ్ (Tollywood) హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు ఎన్బీకే 107. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్బీకే 107 ఫస్ట్ లు, టైటిల్ ను అనౌన్స్ మెంట్ ఉంటుందని సమాచారం.
ఉగాది కానుకగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ అప్ డేట్స్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్సయ్యారట. మొత్తానికి నందమూరి అభిమానులకు ఉగాదితోపాటు మరో పండుగ కూడా రాబోతుందన్నమాట. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ (Duniya Vijay) విలన్గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోన్న విషయం తెలిసిందే.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ బ్యాక్డ్రాప్లో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. క్రాక్ సక్సెస్ తో ఫుల్ జోస్ మీదున్నాడు గోపీచంద్ మలినేని..మరోవైపు అఖండ బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టడంతో ఆ సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు బాలయ్య. ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.