Nandamuri Balakrishna | పాలకొల్లు ఎమ్మెల్యే, ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు తన కుమార్తె వివాహానికి ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించగా.. బాలకృష్ణ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. పెళ్లికి ఎలా వస్తానో చెప్పను కానీ వస్తాను అంటూ బాలయ్య తనను ఆటపట్టించాడంటూ నిమ్మల ఒక వీడియోను పంచుకున్నాడు.
హైదరాబాదు ప్రసాద్ ల్యాబ్స్‌లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ గారిని కలిసి పాలకొల్లులో ఈనెల 24వ తేదీన జరగబోయే నా కుమార్తె శ్రీజ వివాహా శుభలేఖ అందజేసి రమ్మని ఆహ్వానించగా.. బాలయ్య వస్తానని ఎలా వస్తానో చెప్పనని తెలిపారు. అలాగే ప్రముఖ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను గారు ను కూడా రమ్మని ఆహ్వానించడం జరిగిందంటూ నిమ్మల ఈ వీడియోపై రాసుకోచ్చాడు. సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బోయపాటి శ్రీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఎలా వస్తానో చెప్పను వస్తాను…
హైదరాబాదు ప్రసాద్ ల్యాబ్స్ లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ గారు ను కలిసి పాలకొల్లులో ఈనెల 24వ తేదీన జరగబోయే నా కుమార్తె శ్రీజ వివాహా శుభలేఖ అందజేసి రమ్మని ఆహ్వానించగా వస్తానని ఎలా వస్తానో చెప్పనని తెలిపారు. మరియు ప్రముఖ చిత్ర… pic.twitter.com/zTOS156Rk7— Nimmala Ramanaidu (@RamanaiduTDP) September 3, 2025