Nandamuri Balakrishna | దివంగత నటుడు నందమూరి తారక రామారావు నటవారసత్వాన్ని కొనసాగిస్తూ.. అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బీకే 109లో నటిస్తున్నాడని తెలిసిందే. అయితే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై మాత్రం ఎప్పుడు ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉన్నా.. క్లారిటీ మాత్రం మిస్సవుతుంది.
చాలా కాలంగా డైలమాలో ఉన్న అభిమానులకు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) ఎంట్రీ త్వరలోనే ఉండబోతుందంటూ క్లారిటీ ఇచ్చాడు బాలకృష్ణ. విశ్వక్సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడని తెలిసిందే. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నాకు మంచి అనుబంధం ఉన్న కొద్దిమందిలో విశ్వక్సేన్ ఒకరు. ప్రేక్షకులకు ఏదైనా కొత్తదనంతో కూడిన వినోదం అందించాలని ప్రయత్నిస్తుంటారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని పంచుతుందని విశ్వసిస్తున్నానన్నాడు.
ఇండస్ట్రీకి త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ, అడివిశేష్ లాంటి యాక్టర్లను స్పూర్తిగా తీసుకోవాలని నేనెప్పుడూ మోక్షజ్ఞకు చెప్తుంటా. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా నవతరం కథలను అందించేలా యాక్టర్లు తమను తాము మార్చుకోవాలని సూచించారు. ఆడియెన్స్ త్వరలోనే విశ్వక్సేన్, బాలకృష్ణ కాంబోను చూస్తానని.. దీని ప్రకటన కూడా త్వరలో ఉండబోతుందని చెప్పి అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతున్నాడు.