Rudrangi | తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ
Rudrangi | జగపతిబాబు, ఆశిష్‌గాంధీ, మమతా మోహన్‌దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, డాక్టర్ రసమయి బాలకిషన్ నిర్మించారు. జూలై 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర నటుడు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Rudrangi | జగపతిబాబు, ఆశిష్‌గాంధీ, మమతా మోహన్‌దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, డాక్టర్ రసమయి బాలకిషన్ నిర్మించారు. జూలై 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర నటుడు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గొప్ప కళాభిమాని అయిన రసమయి బాలకిషన్‌ను తెలంగాణ సాంస్కృతిక సారథిగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు. . తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ. ఇక్కడి ప్రజలు భూస్వాములపై పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తమ కలను సాకారం చేసుకున్నారు. ఈ రోజు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా నా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమే నా దృష్టిలో నిజమైన నటన. నటించడం కాదు పాత్రలో జీవించడం గొప్ప. సినిమాలు బాగా ఆడితేనే పరిశ్రమ వర్థిల్లుతుంది. అభిరుచి కలిగిన నిర్మాతల వల్ల్లే ఈ రోజు తెలుగు చిత్రసీమ బతికి బట్టకడుతున్నది.‘రుద్రంగి’ సినిమాకు మంచి నటీనటులు కుదిరారు. ఈ రోజు తెలుగు చిత్రాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. దేశమంతా తెలుగు సినిమాను చూస్తున్నారు. తెలుగు సినిమాకు పోటీ ఎవరూలేరనే స్థాయికి మనం ఎదిగాం. తప్పకుండా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ‘బాలకృష్ణగారు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడమే పెద్ద విజయంగా భావిస్తున్నా. ఇల్లంతకుంటలో ‘వీరసింహా రెడ్డి ’ సినిమా షూటింగ్ జరిగింది. పెద్ద హీరో షూటింగ్ అంటే ఎంత ఆర్భాటంగా ఉంటుందో అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్లినప్పుడు బాలకృష్ణగారు నిరాడంబరంగా ఉన్నారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కనిపించారు. బాలకృష్ణగారిని అభిమానులు ఎందుకు అంతగా ప్రేమిస్తారో ఆ రోజు నాకు అర్థమైంది తెలంగాణ నేలకు, వారసత్వానికి గొప్ప పోరాట నేపథ్యం ఉంది.
ఆ పోరాటాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాలని ఈ సినిమా తీశాను. నా పది సంవత్సరాల కల ఇది. జగపతిబాబుగారు ఒప్పుకోకపోతే ఈ సినిమా సాకారం అయ్యేది కాదు. భీమ్రావ్ పాత్రలో ఆయన అద్భుతంగా ఒదిగిపోయారు’ అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ ‘బాలకృష్ణగారిని ఈ వేడుకకు ఆహ్వానించాలని మూడు నెలలుగా అనుకుంటున్నా. నేను అడగ్గానే ఆయన అంగీకరించారు. భారీ బడ్జెట్ అవసరం అవుతుంది కాబట్టి తొలుత ఈ సినిమా నేను చేయనని చెప్పాను. ‘లెజెండ్’ తర్వాత ఎనభైకి పైగా సినిమాలు చేసినా..అందులో పది మాత్రమే గొప్పగా చెప్పుకునేలా ఉన్నాయి. అందులో ‘రుద్రంగి’ ఒకటి అవుతుంది. ఈ సినిమా ద్వారా నాకు కొత్త లైఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది. తెలంగాణ ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

