Namrata Shirodkar | నాగర్ కర్నూల్ (Nagarkarnool) జిల్లా బిజినేపల్లి మండలంలో ఉన్న వట్టెం వేంకటేశ్వరస్వామి (Vattem Venkateshwara Samy Temple) ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు (Mahesh Babu) సతీమణి, సినీ నటి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నమ్రత ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయంలోని గోశాలను సైతం సందర్శించారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన నమ్రతకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం శాలువాతో సత్కరించారు. ఆలయానికి సంబంధించిన వివరాలు ఉన్న పుస్తకాన్ని బహూకరించారు. ఆలయానికి సంబంధించిన చరిత్రను వివరించారు. దర్శనానంతరం నమ్రత మాట్లాడుతూ తిరుమల ఆలయానికి వచ్చిన అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. ఇక్కడ కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.