‘అందరినీ నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశాం. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్‌లో ఇదే నా ఫేవరేట్’ అన్నారు యువ హీరో సంతోష్‌శోభన్. ఆయన నటించిన తాజా చిత్రం ‘లైక్ షేర్ సబ్‌స్ర్కైబ్’. మేర్లపాక గాంధీ దర్శకుడు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. సంతోష్‌శోభన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను యూట్యూబర్ విప్లవ్ పాత్రలో కనిపిస్తా. ట్రావెల్ వ్లాగర్స్ నేపథ్యంలో మొదలైన కథ యాక్షన్ కామెడీగా మలుపుతీసుకోవడం ఉత్కంఠగా అనిపిస్తుంది.
సీరియస్ కథాంశాన్ని హాస్యప్రధానంగా చెప్పడమే హైలైట్‌గా నిలుస్తుంది. మారేడుమిల్లి అడవిలో షూటింగ్ చేశాం. అక్కడ మాకు యూట్యూబ్ వ్లాగర్స్ కనిపించారు. వారికి మాకంటే సోషల్‌మీడియా గురించి ఎక్కువ అవగాహన ఉందనిపించింది. నేటి సోషల్‌మీడియా హవాలో ఈ కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మనం కథల గురించి ఎక్కడో వెతుకుతాం కానీ మన చుట్టూ ఎన్నో కథలున్నాయని షూటింగ్ సందర్భంగా అర్థం చేసుకున్నా’ అన్నారు.