The Ghost | మండే ఎండలో కష్టపడుతున్నాడు నాగార్జున. మామూలుగానే మన దగ్గర ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాంటిది దుబాయ్‌లో ఉన్నది మొత్తం ఎడారి.. అక్కడ ఎండలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడే ఘోస్ట్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు నాగార్జున. మరికొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టిల్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వీటిని చూసి నాగార్జున ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దాంతో పాటు తమ హీరో జాగ్రత్త అంటూ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు.
ఘోస్ట్ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే చేస్తున్నాడు నాగార్జున. ఇందులో సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు ఈయన. గరుడవేగ అలాంటి సినిమా తర్వాత ప్రవీణ్ నుంచి వస్తున్న ప్రాజెక్టు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇందులో ముందుగా నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేశారు. అయితే ఆమె గర్భవతి కావడంతో సినిమా నుంచి తప్పుకుంది. ఇందులో హీరోయిన్ యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అందుకే ఇందులో నుంచి తప్పుకుంది కాజల్. ఇదిలా ఉంటే కాజల్ స్థానంలోకి సోనాల్ చౌహన్ వచ్చి చేరింది.
Action Loading….#TheGhost #TheGhostDubaiDiaries pic.twitter.com/m9TsVdcYEh
— Praveen Sattaru (@PraveenSattaru) March 16, 2022
బాలయ్య సరసన డిక్టేటర్, లెజెండ్, రూలర్ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకు.. మిగిలిన హీరోలు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత నాగార్జున సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది సోనాల్ చౌహాన్. ఈ మధ్యే ఇద్దరి ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటికి వచ్చాయి. అందులో నాగార్జునను చూసి ఫిదా అయిపోతున్నారు. ఈ వయసులో కూడా ఇంత అందంగా ఎలా ఉన్నాడు.. ఆయన ఫిట్నెస్ మంత్ర ఏంటి అంటూ అందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు దర్శక నిర్మాతలు. ఇదే ఏడాది సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అన్నట్లు నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తుంది ఈ సినిమా. ఘోస్ట్ కోసం దాదాపు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు.
“Sonal Chauhan | నాకేం తెలియదంటూనే సోనాల్ చౌహాన్ సైలెంట్ ప్రమోషన్”
Vaishnavi Ganatra | ‘నాగ్ సార్ నుంచి చాలా నేర్చుకున్నా’”
Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు.. ఇదుగో సాక్ష్యం”