ఆడియన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ధనుష్ ‘కుబేరా’ ఒకటి. అక్కినేని నాగార్జున ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పానిండియా సినిమాను సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 20న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మేకర్స్ మొదలు పెట్టారు. శేఖర్ కమ్ముల సినిమాలన్నీ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్సే. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ సినిమాలోని తొలి పాటను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాంగ్ ఎనౌన్స్మెంట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. విజిల్ వేస్తూ డాన్స్ చేస్తున్న ధనుష్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.