తెలుగు సినిమా దిశను సమూలంగా మార్చిన సినిమా ‘శివ’. తెలుగు సినిమా అంటే ‘శివ’కు ముందు ‘శివ’ తర్వాత.. అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. 1989లో విడుదలైన ఈ సినిమా సృష్టించిన చరిత్ర అలాంటిది. దర్శకునిగా రామ్‌గోపాల్‌వర్మ తొలి సినిమా ఇది. తొలి సినిమాతోనే డైరెక్షన్‌కి కొత్త నిర్వచనం చెప్పారు వర్మ. కథానాయకుడిగా అక్కినేని నాగార్జునకు దశాబ్దాలపాటు గుర్తుండిపోయే విజయాన్ని ఇచ్చారు.
ప్రస్తుతం రీరిలీజుల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ‘శివ’ మళ్లీ విడుదల కానుంది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 14న మరోసారి బిగ్ స్క్రీన్‌పైకి ఈ సినిమాను తీసుకురానున్నారు. అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రీ మాస్టర్ చేసి, అడ్వాన్స్ 4K డాల్బీ అట్మాస్లోకి మార్చి ‘శివ’ను విడుదల చేస్తున్నామని, కథలను ఎప్పటికీ సజీవంగా ఉంచడమే నాన్నగారికి సరైన నివాళి అని అక్కినేని నాగార్జున చెప్పారు.