నువ్వు గుంటనక్కవే.. యాంకర్ రవిపై సీరియస్ అయిన నాగార్జున

Nagarjuna serious on Anchor Ravi in Bigg boss 5 Telugu | అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది అంటారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో యాంకర్ రవి పరిస్థితి చూస్తే ఇదే అనిపిస్తుంది. షో మొదలైనప్పటి నుంచి అన్ని వారాలు దాదాపు నామినేషన్స్‌లోనే ఉంటూ వస్తున్నాడు యాంకర్ రవి. ఆయన ఏం చేసినా కూడా రివర్స్ అవుతున్నాయి. తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. మూడో వారంలో లహరి విషయంలో రవి ఎంత అభాసుపాలు అయ్యాడో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అన్న మాటను అనలేదు అని చెప్పి కెమెరాల ముందు అడ్డంగా దొరికిపోయాడు. మూడో వారం లహరి బయటికి వెళ్లింది అంటే దానికి కారణం యాంకర్ రవి అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అడ్డంగా దొరికిపోయాడు యాంకర్ రవి. ఒక టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న పిల్లోస్ తీసుకొచ్చి.. అందులో ఉన్న కాటన్‌ను బొమ్మల తయారీ కోసం వాడుకున్నాడు. ఈ టాస్క్‌లో రవి చేసిన పని కారణంగా శ్వేత వరస్ట్ పర్ఫార్మర్గా జైలుకు వెళ్లింది. లోబోకు కూడా విమర్శలు వచ్చాయి. రవి చెప్పినందుకు చేశాను అంటే.. రవి గడ్డి తినమంటే తింటావా అంటూ నాగార్జున సీరియస్ అయ్యాడు. మరోవైపు తన తప్పు ఇంటి సభ్యుల ముందు ఒప్పుకున్నాడు యాంకర్ రవి. కానీ వీకెండ్ వచ్చిన తర్వాత నాగార్జున ముందు ఈ విషయం వచ్చింది. అక్కడ మరోసారి రవిని తప్పు పట్టి అతనిపై సీరియస్ అయ్యాడు నాగార్జున.
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వస్తువులను డ్యామేజ్ చేయకూడదనే రూల్ తెలియదా అంటూ సీరియస్ అయ్యాడు. మరోవైపు శ్వేతకు తాము ఇలా చేస్తున్నట్టు తెలియదు అంటూనే తాను చేసిన పనిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు యాంకర్ రవి. వెంటనే ఇందులో ఇన్వాల్వ్ అయిన శ్వేత.. అదేం లేదు సార్.. రవికి అన్నీ తెలుసు.. ఈ ఐడియా ఇచ్చింది కూడా తనే అంటూ ఓపెనైపోయింది. ఇప్పుడు మాట మారుస్తున్నాడని చెప్పుకొచ్చింది. నిరూపించుకునే వీలు లేకుండా వీడియోతో సాక్ష్యం చూపించాడు నాగార్జున. దాంతో మరోసారి రవి అడ్డంగా బుక్కయ్యాడు. ఇదంతా చూసిన తర్వాత నటరాజ్ మాస్టర్ అన్న గుంటనక్క బిరుదు నీకు సరైందే అంటూ నాగార్జున చెప్పడం గమనార్హం. మొత్తానికి ఈ వీకెండ్ ఎలా ముగుస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg Boss : ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవరో తెలుసా?
Bala Krishna: జబర్దస్త్ షోకి జడ్జిగా బాలకృష్ణ.. రోజా అడగడంతో నో అంటాడా మరి..!
Priyanka : సిరికి క్యారెక్టర్ లేదన్న షణ్ముఖ్.. అడిగి మరీ ప్రపోజ్ చేయించుకుంటున్న ప్రియాంక
Priyanka : మానస్‌తో మాట్లాడొద్దని ప్రియాంకకు శిక్ష విధించిన విశ్వ.. !
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. అఖిల్ టార్గెట్ అదుర్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

