మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. అఖిల్ టార్గెట్ అదుర్స్..

most eligible bachelor pre release business | అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో వాసు వర్మ, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నాడు. ఈ సినిమాతో అఖిల్ తొలి విజయం అందుకోవాలని కసితో ఉన్నాడు. క్లాస్ సబ్జెక్ట్ అయినా కూడా.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని బలంగా నమ్ముతున్నాడు భాస్కర్. బొమ్మరిల్లు తర్వాత ఆ స్థాయి విజయం లేని ఈ దర్శకుడికి ఇప్పుడు యాసిడ్ టెస్ట్ లా మారిపోయింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. అలాగే అఖిల్ అక్కినేనికి కూడా ఈ సినిమా అలాగే మారిపోయింది. డూ ఆర్ డై అన్నట్లుగా వస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కచ్చితంగా హిట్ ఇస్తుందని నమ్ముతున్నాడు అఖిల్. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఒక్కసారి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం..
నైజాం: 6.50 కోట్లు
సీడెడ్: 2.48 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.55 కోట్లు
ఈస్ట్: 1.78 కోట్లు
వెస్ట్: 1.44 కోట్లు
గుంటూరు: 1.80 కోట్లు
కృష్ణా: 1.44 కోట్లు
నెల్లూరు: 0.77 కోట్లు
ఏపీ + తెలంగాణ: 18.80 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2.11 కోట్లు
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 20.91 కోట్లు షేర్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి రూ.20.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 21 కోట్లకు పైగానే వసూలు చేయాలి. ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసుకోవచ్చు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా నిలబడుతుందని నమ్ముతున్నారు బయ్యర్లు. ‘మహాసముద్రం’ సినిమాకు నెగిటివ్ టాక్ రావడం కూడా అఖిల్ సినిమాకు కలిసి రానుంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కచ్చితంగా అఖిల్ తొలి హిట్ కొట్టడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Most eligible Bachelor Movie | క్రెడిట్ గురించి ఆలోచించలేదు!
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..?
Most Eligible Bachelor | మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కుటుంబం ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

