‘కుబేర’ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ లభిస్తున్నది. బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ రివ్యూలొచ్చాయి. ఎప్పటి నుంచో ఓ కొత్త క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా. శేఖర్ కమ్ముల తన సినిమాలోని పాత్రలను అద్భుతంగా డిజైన్ చేస్తాడు. ఈ కథ వినగానే నాది మెయిన్ క్యారెక్టర్ అనిపించింది. నేను పోషించిన దీపక్ పాత్ర మూడుషేడ్స్తో కనిపిస్తుంది. అందుకే బాగా నచ్చింది’ అన్నారు అగ్ర నటుడు అక్కినేని నాగార్జున. ఆయన ధనుష్‌తో కలిసి నటించిన ‘కుబేర’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకుడు. శనివారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున..ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల ప్రాణం పెట్టి పనిచేశారని ప్రశంసించారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘నా సినిమాలన్నింటిలో అత్యంత నిజాయితీగా చేసిన చిత్రమిది. ఈ కథలో చాలా విషయాల్ని చెప్పే ప్రయత్నం చేశా. ఈ క్రమంలో కాస్త నిడివి ఎక్కువైంది. అది కథకు అవసరం కూడా. ఒక పాయింట్‌ని నిజాయితీగా చెప్పడమే మా ధర్మం.
ఈ సినిమా గురించి ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకోవడం చాలా గర్వంగా, ఆనందంగా ఉంది’ అన్నారు. కథ విన్నప్పుడే సూపర్‌హిట్ అవుతుందని ఊహించానని, నాగార్జునగారి సపోర్ట్ వల్ల అనుకున్న సమయానికి రిలీజ్ చేయగలిగామని, హౌస్‌ఫుల్ బుకింగ్స్ వస్తున్నాయని నిర్మాత సునీల్ నారంగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాకు బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ వచ్చిందని మరో నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ రావు తెలిపారు.