బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్ కంట్రోల్ తప్పడంతో నాగార్జున ఒక్కొక్కరికి చురకలు అంటించారు. ముందుగా కెప్టెన్ అయిన షణ్ముఖ్‌ని అభినందించాడు.అలానే ఇంటి నుండి వచ్చిన లెటర్స్ త్యాగం చేసిన వారిని చప్పట్లతో అభినందించాడు. కెప్టెన్సీ టాస్క్‌ను మధ్యలో వదిలేసిన యానీ మాస్టర్‌ను బిగ్‌బాస్ హౌస్‌లో ఉండి ఎందుకు? అని ప్రశ్నించాడు. ఇకపై డల్‌గా ఉండొద్దని సూచించాడు.
కాజల్‌ను తొండాట వద్దని, పద్ధతిగా ఆడమని హితవు పలికాడు. తర్వాత సన్నీ ఫొటోను చేతులతో చింపేశిన నాగ్.. వరస్ట్ పర్ఫామర్‌గా జైలుకు పంపించినా మార్పు రాలేదా? అని నిలదీశాడు. ఒక వ్యక్తి పట్టుకున్న బ్యాగును తన్నడం సరైనదా? అని తిట్టిపోశాడు. బాగా ఆడుతున్నావ్ అంటూనే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోమని సూచించాడు. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయ్ కాని వేలెత్తి చూపడం, మీద మీదకు వెళ్లడం చేయకు అని అన్నాడు నాగార్జున.
మానస్, కాజల్,రవితో పాటు పలువురికి నాగ్ చురకలు అంటించాడు. ఇక ఆ తర్వాత తర్వాత హౌస్‌మేట్స్‌తో వైకుంఠపాళి గేమ్ ఆడించాడు నాగ్. ఈ ఇంట్లో పైకి వెళ్లకుండా కాటేసేది, ముందుకు వెళ్లడానికి నిచ్చెనలా సాయం చేసేది ఎవరో చెప్పాలని ఆదేశించాడు. ముందుగా కాజల్. సాయపడే నిచ్చెన మానస్ అని, పాములా అడ్డుకునేది శ్రీరామ్ అని చెప్పుకొచ్చింది. రవి.. తనను పైకి ఎక్కించేది షణ్ను అని, కాజల్‌తో కనెక్షన్ అవడం లేదంటూ ఆమెను పాముగా పేర్కొన్నాడు.
జెస్సీ.. విశ్వ నిచ్చెన అని, తనకు గొడవలు నచ్చవంటూ సన్నీని పాముగా తెలిపాడు. ప్రియాంక.. మానస్ తనను ముందుకు తీసుకెళ్లే నిచ్చెనగా, లోబోను పాముగా పేర్కొంది. సన్నీ.. మానస్ నిచ్చెన అని, సైలెంట్‌గా ఉంటూ కాటేసే షణ్ముఖ్ పాము అని అభిప్రాయపడ్డాడు. అనీ.. రవిని నిచ్చెనగా, కాజల్‌ను పాముగా; విశ్వ.. లోబోను నిచ్చెనగా, కాజల్‌ను పాముగా తెలిపారు. లోబో.. రవి నిచ్చెన అని, సన్నీ పాము అని చెప్పుకొచ్చాడు. శ్రీరామచంద్ర.. యానీ నిచ్చెన అని, పాములో ఉండాల్సిన లక్షణాలన్నీ కాజల్‌కు ఉన్నాయని తెలిపాడు.
ఇక మిగిలిన ఒక్కొక్కరికీ క్లాస్‌లు పీకడం పూర్తైన తరువాత వైకుంఠపాళి ఆట ఆడించారు. ఇందులో కాజల్ ఇంట్లో ఉన్నవాళ్లని కాటేస్తుందంటూ ఎక్కువమంది ఆమెను పాములా నామినేట్ చేశారు. ఆ తరువాత.. ఒక్కొక్కరికీ ఒక్కొక్క సామెత ఇచ్చి.. ఆ సామెత ఎవరికి కనెక్ట్ అవుతుందో అది తీసుకుని వెళ్లి మెడలో వేయాలని చెప్పారు నాగార్జున.