ఆ ఆలోచన నుంచే నాగబంధం కథ పుట్టింది
‘తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి ఆలయంలో ఓ నేలమాళిగ ఎందుకు తెరవలేదు? అనే విషయంపై చాలా చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన అంశం అది. నిజంగా ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ ఓ ఫిక్షనల్ స్టోరీ రాస్తే బావుంటుందనిపించింది.
‘తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి ఆలయంలో ఓ నేలమాళిగ ఎందుకు తెరవలేదు? అనే విషయంపై చాలా చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన అంశం అది. నిజంగా ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ ఓ ఫిక్షనల్ స్టోరీ రాస్తే బావుంటుందనిపించింది.
ఆ ఆలోచన నుంచే ‘నాగబంధం’ కథ పుట్టింది ’ అని తెలిపారు దర్శకుడు అభిషేక్ నామా. ఆయన దర్శకత్వంలో రూపొందిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. విరాట్‌కర్ణ కథానాయకుడు, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు. కిశోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో అభిషేక్ నామా విలేకరులతో మాట్లాడారు.
- మంచి కథ రాయాలని ప్రయత్నించాను తప్ప, ఫలానా హీరో కోసం అని రాసిన కథ కాదు ఇది. కథ పూర్తయ్యాక, తగ్గ వారిని ఎంపిక చేశాం. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ముఖ్యంగా విరాట్‌కర్ణ అయితే జీరో డిగ్రీస్ చలిలో షర్ట్ లేకుండా
అడ్వెంచర్, యాక్షన్ సన్నివేశాల్లో నటించాడు. తనకు ఈ సినిమాతో మంచి పేరొస్తుంది. ఇది నేను విజువలైజ్ చేసుకున్న కథ. నా విజన్‌ని నేనే డైరెక్ట్ చేస్తే బావుంటుంది. అందుకే డైరెక్ట్ చేశా. 107 రోజుల్లో సినిమాను పూర్తి చేసి, అనుకున్న టైమ్‌కి విడుదల చేస్తున్నాం. - రియల్ టెంపుల్లో షూట్ చేయాలనుకున్నాం. కానీ అనుమతులు దొరక్కపోవడంతో సెట్స్ వేయాల్సివచ్చింది. సెట్స్, ఆర్ట్ వర్క్, మేకప్, సీజీ విషయంలో బడ్జెట్ పెరిగింది. వందకోట్ల బడ్జెట్ అవుతుందని ఊహించలేదు. కేవలం కథను నమ్మి, కావాల్సినంత బడ్జెట్‌ని సమకూర్చారు నిర్మాతలు. రీసెంట్గా అవుట్‌పుట్ చూసి వారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కుటుంబం అంతా కలిసి చూసే కమర్షియల్ సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా 2500 థియేటర్లలో విడుదల చేస్తున్నాం.
- జువైద్, అభి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఇక కెమెరా, వీఎఫ్ఎక్స్ అయితే నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా ఆకట్టుకుంటుంది. ‘నాగబంధం 2’ ఆలోచన కూడా ఉంది. సీక్వెల్ చేయడానికి చాలామంచి అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

