Naga Shaurya | ఎట్టకేలకు నాగశౌర్య సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనాకు ముందే ప్రారంభమైంది. కానీ పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. గతకొన్ని నెలలుగా ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.
Phalana Abhayi Phalana ammayi Movie | టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఓ కమర్షియల్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. డిఫరెంట్ జానర్లో సినిమాలు చేస్తున్నా.. అవుట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకులు ఈయన సినిమాలను తిప్పి కొడుతున్నారు. ‘ఛలో’ తర్వాత ఇప్పటివరకు నాగశౌర్యకు మరో హిట్టు లేదు. మధ్యలో ఎంతో కష్టపడి చేసిన ‘ఆశ్వథ్థామ’ పాజిటీవ్ టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. పైగా ఈ సినిమాకు నాగశైర్య స్వయంగా కథనందించాడు. ఇటీవలే రిలీజై ‘కృష్ణ వ్రిందా విహారి’ కూడా మొదటి రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కథ బాగానే ఉన్నా కథనం లోపించి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఏదేమైనా నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనాకు ముందే ప్రారంభమైంది. కానీ పలు కారణాల వలన షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. గతకొన్ని నెలలుగా ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్లు రాకపోవడంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఆ వార్తలకు చెక్ పెట్టారు. రొమ్ కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ పోస్టర్లో నాగశౌర్య, మాళవికా నాయర్ బస్‌లో ఒకరిపై ఒకరు వాలిపోయి.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వింటూ కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ సగ భాగం ఇండియాలో, మరో సగ భాగం అమెరికాలో సాగనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానందా వంటి క్లాసికల్ లవ్స్టోరీల తర్వాత నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబోలో సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
Presenting the
First emotion of #PAPA
Phalana Abhayi Phalana Ammayi❤💞@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla @PSrividya53 pic.twitter.com/d2QmUNQpEh— People Media Factory (@peoplemediafcy) January 2, 2023
Read Also:
Shakunthalam | శాకుంతలం రిలీజ్ డేట్‌పై సమంత అభిమానులు అసంతృప్తి.. దిల్‌రాజు ఇలా చేశాడేంటి..!
Vaishnav Tej | వారం గ్యాప్‌లో మెగా మేనళ్లుల పోటీ.. వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Hit-2 Movie | సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి హిట్-2 మూవీ..!
SSMB29 | మహేష్ కోసం రాజమౌళి భారీ స్కెచ్.. ఈ సారి సీక్వెల్స్‌తో హాలీవుడ్‌కు ధీటుగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

