Hit-2 Movie | సంక్రాంతి కానుకగా ఓటీటీలోకి హిట్-2 మూవీ..!
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్నాడు. తన థ్రిల్లర్ జానర్లో కంఫర్ట్‌గా సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ ఏడాది మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టిన అడివిశేష్.. ఇటీవలే రిలీజైన హిట్టు-2తో మరో బ్లాక్‌బస్టర్ సాధించాడు.
Hit-2 Movie On Ott | టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్నాడు. తన థ్రిల్లర్ జానర్లో కంఫర్ట్‌గా సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ ఏడాది మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టిన అడివిశేష్.. ఇటీవలే రిలీజైన హిట్టు-2తో మరో బ్లాక్‌బస్టర్ సాధించాడు. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సంచలన విజయం సాధించింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక అడివిశేష్ ఈ సినిమాతో వరుసగా ఆరు హిట్లు సాధించి డబుల్ హ్యట్రిక్ను సొంతం చేసుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటించింది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని నిర్మించాడు. ఇక మూడో పార్ట్‌లో నాని కథానాయకుడిగా నటించనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

