Shakunthalam | శాకుంతలం రిలీజ్ డేట్‌పై సమంత అభిమానులు అసంతృప్తి.. దిల్‌రాజు ఇలా చేశాడేంటి..!
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయి. రేండెళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు.
Shakunthalam Movie Release date | సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయి. రేండెళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. అప్పుడొస్తుంది, ఇప్పుడొస్తుంది అని చిత్రబృందం పలు డేట్లు ప్రకటించిన.. క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయి తప్ప సినిమా మాత్రం రిలీజ్ కావడం లేదు. గతేడాది నవంబర్‌లో ఈ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేస్తున్నట్లు గుణ శేఖర్ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. కానీ మళ్లీ పోస్ట్ పోన్ చేసి సమంత అభిమానులను నిరాశపరిచాడు.
తాజాగా చిత్రయూనిట్ మరో కొత్త డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ రిలీజ్ డేట్ సమంత అభిమానులను టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే అదే రోజున మరో మూడు సినిమాలు బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకున్నాయి. ధనుష్ హీరోగా నటిస్తున్న ‘సార్’ మూవీ అదే రోజున రిలీజ్ కానుంది. సితార సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన ‘దాస్ కా ధమ్కీ’ అదే రోజున రిలీజ్ కానుంది. మొన్నటి వరకు ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు. కానీ గత నెలలో రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చింది. వీటితో పాటుగా కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కూడా అదే రోజున రిలీజ్ కానుంది.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంతగా బజ్ లేదు. కానీ గీతా ఆర్ట్స్ చివరి నిమిషంలో ఏదో ఒక మాయ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తారు. ఇన్ని సినిమాల మధ్యన శాకుంతలం రిలీజ్ చేస్తున్నారంటే రిస్క్ అనే చెప్పాలి. పైగా ఈ సినిమాకు దాదాపు 80కోట్ల బడ్జెట్ అయింది. ఆ మూడు సినిమాలన్నిటి బడ్జెట్ కలిపినా ఈ ఒక్క సినిమా బడ్జెట్ అంత ఉండదు. ఇక ఈ సినిమాకు గుణశేఖర్ నిర్మాత కావడం మరో విశేషం. ఇన్ని ట్విస్టుల మధ్య సమంత అభిమానులకు ఏదైనా సంతృప్తి ఉందంటే అది దిల్‌రాజే. ఈ సినిమాకు దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మిగితా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు ఎక్కువగా థియేటర్లు దొరికే చాన్స్ ఉంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో 3డీలో రిలీజ్ కానుంది.
https://twitter.com/Samanthaprabhu2/status/1609784129096388609?s=20&t=pPS5OS67Ag0ZDCvLPwATpg
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

