Naga Shaurya Lakshya | ‘లక్ష్య’తో నాగ శౌర్య లక్ష్యం చేరుకున్నాడా?
తెలుగు ఇండస్ట్రీ (Telugu Cinema)లో ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా (Sports Movies)లు ఎక్కువగా వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మిగిలిన సినిమాలు కనీసం వచ్చినట్లు కూడా వాళ్లు గుర్తుంచుకోవడం లేదు.

తెలుగు ఇండస్ట్రీ (Telugu Cinema)లో ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా (Sports Movies)లు ఎక్కువగా వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మిగిలిన సినిమాలు కనీసం వచ్చినట్లు కూడా వాళ్లు గుర్తుంచుకోవడం లేదు. నిజానికి స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాలకు విజయావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కథ తెలిసిందే అయినా కూడా.. కథనం పకడ్బందీగా ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. నాని జెర్సీ సినిమా అవార్డులతో పాటు అనేక రివార్డులు కూడా సాధించడానికి.. అందులో ఉన్న స్క్రీన్ ప్లే మ్యూజిక్ కారణం. ఈ ఏడాది చెక్ సినిమా చెస్ చేసిన నేపథ్యంలో వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించాడు.
ఇది అసలు వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఆర్చరీ నేపథ్యంలో నాగ శౌర్య నాగశౌర్య (Naga Shaurya) హీరోగా లక్ష్య (Lakshya) సినిమా వచ్చింది. మూడేళ్ల కిందట సుమంత్ హీరోగా వచ్చిన సుబ్రమణ్యపురం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ జాగర్లమూడి (santhossh Jagarlapudi) ఈ సినిమాకు దర్శకుడు. నిజానికి విలువిద్య నేపథ్యంలో తెలుగులో ఇప్పటివరకు సినిమాలు రాలేదు. అందుకే ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు దర్శకుడు.
కథ విషయంలో కొత్తదనం ఉంది కానీ కథనం మాత్రం చాలా వీక్ అంటున్నారు ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ బాగోలేదంటూ పెదవి విరుస్తున్నారు. మనవడిని ఛాంపియన్ చేయడానికి తన తాత ప్రాణాలు పోగొట్టుకుంటాడు. కానీ తాత చనిపోయిన తర్వాత హీరో లక్ష్యం మరచిపోయి రోడ్లమీద తాగుతూ.. డ్రగ్స్ కు అలవాటు పడి తిరుగుతూ ఉంటాడు. కనీసం తన తాత లక్ష్యం కూడా హీరోకు గుర్తుండదు. ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు మైనస్ అయ్యింది అంటున్నారు విశ్లేషకులు.
నాగ శౌర్య తన వరకు అద్భుతంగా నటించాడు. ఈ సినిమా కోసం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. కానీ కథ మాత్రం సహకరించలేదంటున్నారు ప్రేక్షకులు. 8 ప్యాక్ చేసి ఆహా ఓహో అనిపించినా.. కథలో అలాంటి మూమెంట్స్ లేకపోవడంతో లక్ష్య లక్ష్యానికి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఛలో సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం కోసం చూస్తున్న నాగశౌర్యకు లక్ష్య కూడా నిరాశ కలిగించేలా ఉంది.
ఇవి కూడా చదవండి..
Sara Ali Khan | సారా అలీఖాన్‌కు ఏ తెలుగు హీరోతో నటించాలని ఉందో తెలుసా..?
Rajamouli About RRR Hero | ‘ఆర్ఆర్ఆర్’ హీరో ఎవరో చెప్పిన రాజమౌళి
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

