Thandel | నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’. శ్రీకాకుళం జిల్లాలోని డి.మచ్చిలేశం గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల సమాహారం ఈ సినిమా. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈ సినిమా మ్యూజిక్ జర్నీని ప్రారంభించారు. ఈ నెల 21 ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి..’ సాంగ్‌ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. లీడ్ పెయిర్ నాగచైతన్య, సాయిపల్లవి పాత్రల అనుబంధాన్ని ఆవిష్కృతం చేసేలా ఈ పోస్టర్ ఉన్నది. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న కథతో ఈ సినిమా రూపొందుతున్నదని, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, ఇద్దరు ప్రేమికుల భావోద్వేగమే ఈ పాట అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్ దత్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: గీతాఆర్ట్స్.