వైవాహిక జీవితంలోని మధురానుభూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారు న్యూ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల. రీసెంట్గా నాగచైన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘భార్యాభర్తలమే అయినా.. వృత్తిపరమైన పని ఒత్తిడుల వల్ల కలిసి ఎక్కువసేపు సమయాన్ని గడపలేని పరిస్థితి. అందుకే ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుకునేందుకు కొన్ని నియమాలను పెట్టుకున్నాం.
ఇద్దరం ఒకే సిటీలో ఉంటే ఉదయం, రాత్రి సమయాల్లో తప్పకుండా కలిసే భోజనం చేయాలనేది అందులో ముఖ్యమైన నియమం. ఆదివారాలు సరదాగా షికారుకెళ్లాలి. నైట్ సినిమాకెళ్లాలి. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడమో, లేక వండుకోవడమో చేయాలి.. ఇలా అనమాట.
తనకు పుస్తకాలు చదవడం ఇష్టం. నాకు రేసింగ్ ఇష్టం. అందుకే సెలవుదినాల్లో ఇద్దరి ఇష్టాలకూ తగ్గట్టు రోజుల్ని ప్లాన్ చేసుకుంటాం. ఇటీవలే తనకు రేస్ ట్రాక్‌పై డ్రైవింగ్ చేర్పించా. తను ఎంతో సంతోషించింది. ఎంజాయ్ చేసింది కూడా’ అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య.