Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో వస్తోన్న రొమాంటిక్ డ్రామా ప్రాజెక్ట్ తండేల్ (Thandel). చందూ మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక్కొక్క పాటలను విడుదల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
ఇక మూవీ లవర్స్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తండేల్ ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్ శ్రీరామ పిక్చర్ ప్యాలెస్ (రామ టాకీస్ రోడ్) వద్ద నిర్వహించనున్నారు. జనవరి 28 సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ఉండబోతుందని తెలియజేశారు మేకర్స్.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండేల్ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Visakhapatnam! 🌊
Dhullakotteyadaniki ready aa? 💥💥#ThandelTrailer MASSIVE launch event at Shri Rama Picture Palace, Vizag on Jan 28th, 5PM onwards.Stay tuned!
▶️ https://t.co/sfp1ccMyKy#Thandel #ThandelonFeb7th pic.twitter.com/oHQu3o26m8— BA Raju’s Team (@baraju_SuperHit) January 27, 2025
Pushpa 2 on OTT | ఓటీటీలోకి ‘పుష్ప 2 ది రూల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ