Thandel Trailer | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ తండేల్ (Thandel). చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ వదిలిన ట్రైలర్ ప్రీల్యూడ్ నెట్టింట వైరల్ అవుతోంది.
వైజాగ్ శ్రీరామ పిక్చర్ ప్యాలెస్ (రామ టాకీస్ రోడ్) వద్ద ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేశారు. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
తండేల్ ట్రైలర్..