నాగచైతన్యకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్
హైదరాబాద్: నగర ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. కార్లకు బ్లాక్ ఫిల్మ్, వాహనాలపై స్టిక్కర్లను ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లో తొలగిస్తున్నారు. అలాగే ఆయా వాహనాల యజమానులకు జరిమానా సైతం విధిస్తున్నారు. ఇటీవల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్, కల్యాణ్ రామ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖుల కార్లను తనిఖీ చేస్తూ.. బ్లాక్ ఫిల్మ్ అక్కడికక్కడే తొలగించడంతో పాటు జరిమానా సైతం విధించారు. నిత్యం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ను చేపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జూబ్లీహిల్స్
చెక్‌పోస్ట్ వద్ద అక్కినేని నాగచైతన్య ప్రయాణిస్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేశారు. కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి, రూ.700 జరిమానా విధించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

