సమంత ఊసెత్తితే నో ఇంటర్వ్యూ.. నాగచైతన్య కొత్త రూల్ !

కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది అంటే అందులో నటించిన వాళ్లు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు. స్టార్ హీరోలు, చిన్న వాళ్లు అని తేడా లేకుండా కచ్చితంగా విడుదలకు ముందు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందే. అందులో మరో ఆప్షన్ లేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల అవుతుందని తెలియాలంటే కచ్చితంగా ప్రమోషన్ ముందు కంటే ఎక్కువగా చేసుకోవాలి. లేదంటే అసలుకే మోసం వస్తుంది. అందుకే పెద్ద హీరోలు కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా తమ సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మొన్న టక్ జగదీష్ విడుదలకు ముందు నాని సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానల్స్‌కు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు నాగచైతన్య కూడా అలాగే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది.

ఫిదా వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత సాయిపల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తగ్గట్టే సినిమా బిజినెస్ కూడా జరిగింది. వచ్చే వారం విడుదలకు సిద్దమైంది. దీంతో సినిమా ప్రమోషన్లో వేగం పెంచారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు నాగచైతన్య ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అది ఫాలో అయితేనే ఇంటర్వ్యూ ఇస్తానని గట్టిగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య ఈ మధ్య కాలంలో సినిమాల కంటే కూడా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉన్నాడు. సమంత, నాగ చైతన్య ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే సమంత గురించి ఎటువంటి ప్రశ్నలు అడగకూడదని హామీ ఇస్తేనే ఇంటర్వ్యూ ఇస్తానని తమ పీఆర్ లకు చైతూ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కండీషన్‌కు ఓకే అంటేనే ఎన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడానికైనా సిద్ధంగానే ఉన్నాడు అక్కినేని వారబ్బాయి. మొత్తానికి సమంత విషయం ఈయనను బాగానే డిస్టర్బ్ చేసిందని అర్థమవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Lobo: లోబో, ఉమా దేవిల మధ్య లవ్ ట్రాకా.. ఏం జరుగుతుంది?
అఖిల్ కోసం మళ్లీ ఆ పని చేస్తున్న పూజా హెగ్డే..
బిగ్ బాస్ వేదికగా షణ్ముఖ్‌పై తన ప్రేమను వ్యక్తపరిచిన దీప్తి
Maestro Review: మాస్ట్రో రివ్యూ.. ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్
Bigg Boss: బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టను, ఎవరికి సపోర్ట్ చేయనన్న హాట్ యాంకర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

