టాలీవుడ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) , వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్లో వస్తున్న సినిమా NC 22. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్, శరత్‌కుమార్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా ఈ సినిమా తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. హైదరాబాద్ లో ఎన్సీ 22 యాక్షన్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్టు వేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ప్రస్తుతం ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న అరవింద్ స్వామితోపాటు మెయిన్ లీడ్ యాక్టర్లు సంపత్ రాజ్, శరత్‌కుమార్, కృతిశెట్టిపై వచ్చే యాక్షన్ పార్టు చిత్రీకరణ కొనసాగుతుందని టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
మహేశ్ మాథ్యూ మాస్టర్ సారథ్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ కొనసాగుతుందట.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. బంగార్రాజు తర్వాత నాగచైతన్య, కృతిశెట్టి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ఇది.
Team #NC22 commences Full-Throttle Action Schedule🔥
The action Sequence is being shot on a Lavish scale in Huge Setup on Enigmatic @chay_akkineni 💥@vp_offl @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @SS_Screens @realsarathkumar #SampathRaj @srinivasaaoffl #VP11 pic.twitter.com/yKMcZBNm3n
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 11, 2022