‘తండేల్’తో కెరీర్లో తొలిసారి వందకోట్ల క్లబ్లో చేరారు నాగచైతన్య. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన తాజా చిత్రంపై చైతూ మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. భారతీయ మూలాలు, ఫాంటసీ అంశాలు కలబోసిన కథాంశంతో ట్రెజర్ హంట్ నేపథ్య మిస్టిక్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎస్సీ24’ వర్కింగ్ టైటిల్. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. హైదరాబాద్లో వేసిన బ్రహ్మగిరి గుహ తాలూకు భారీ సెట్లో కీలక ఘట్టాలను తెరకెక్కించారు.
శుక్రవారం హైదరాబాద్లోనే రెండో షెడ్యూల్ను మొదలుపెట్టారు. నెలరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో చిత్ర ప్రధాన తారాగణం పాల్గొంటారని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రమిదని, త్వరలో టైటిల్ వెల్లడిస్తామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి లోక్నాథ్, నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్.బి, దర్శకత్వం: కార్తీక్ దండు.