Thandel | గడియారంలో సెకనుల ముల్లు గంటకు కదిలిందే..
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్' నుంచి ‘హైలెస్సో హైలెస్సా..’ అనే మూడో గీతాన్ని గురువారం విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్నందించారు. శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ ఆలపించారు.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ నుంచి ‘హైలెస్సో హైలెస్సా..’ అనే మూడో గీతాన్ని గురువారం విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్నందించారు. శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ ఆలపించారు. ‘ఎంతెంత దూరాన్ని నువ్వూ నేనూ మోస్తూ ఉన్నా అసలింత అలుపే రాదు..ఎన్నెన్ని తీరాలు నీకూ నాకు మధ్యన ఉన్నా కాస్తయినా అడ్డే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం..నీవు లేకుండా ఎంత అన్యాయం గడియారంలో సెకనుల ముల్లే గంటకు కదిలిందే.. నీతో ఉంటే కరిగే కాలం..నువు లేకుంటే కదలదు కాలం అని నెలలో ఉండే తేదీ కూడా డాదయ్యిందే..హైలెస్సో..’ అంటూ నాయకానాయికల మధ్య ఉండే అనురాగాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది.
సముద్ర నేపథ్యంలోని విజువల్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. నాగచైతన్య, సాయిపల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలిచింది. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ప్రేమ, దేశభక్తి ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: అల్లు అరవింద్, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

