తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను నవ్విస్తూ..కన్నీళ్లు తెప్పించగల టాలెంట్ ఆయన సొంతం. ఆ లెజెండరీ యాక్టర్ తెరపై కనిపించాడంటే చాలు ఎంతటి బాధలో ఉన్నా..వాటన్నింటినీ మర్చిపోవడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు లెక్కల్లో చెప్పలేనంత అభిమానులున్నారు. ఆయనెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రముఖ లెజెండరీ నటుడు చార్లీ చాప్లిన్ (Charlie Chaplin). మరి అలాంటి నటుడి గెటప్ లో కనిపించాలంటే సాహసమే అని చెప్పాలి. అయితే తాజాగా ఇస్మార్ట్ భామ (Ismart beauty) నభా నటేశ్ (Nabha Natesh) ఆ సాహసమే చేసింది.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నభా నటేశ్ ఎప్పుడూ ఏదో గ్లామరస్ స్టిల్ ను పోస్ట్ చేస్తుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే తాజాగా చార్లీ చాప్లిన్ గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. నభా నటేశ్ చార్లీ చాప్లిన్ లా షూట్ వేసుకుని, చేతిలో కర్ర పట్టుకుని కెమెరాకు పోజులిచ్చింది. నవ్వు లేకుండా ఉన్న రోజు వృథా అయినట్టే..అంటూ చార్లీ చాప్లిన్ కొటేషన్ ను క్యాప్షన్ గా ఇచ్చింది నభా నటేశ్.
మొత్తానికి ఈ భామ చార్లీ చాప్లిన్ గెటప్ ఎందుకు వేసిందో చెప్పకపోయినా..ప్రస్తుతానికి ఈ ఫొటోలతో మాత్రం నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇటీవలే నితిన్ తో కలిసి మ్యాస్ట్రో సినిమాలో నటించింది నభా నటేశ్. ఇస్మార్ట్ బ్యూటీ చార్లీ చాప్లిన్ లా మారిన ఫొటోలు ఇపుడు ఆన్లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.
Glamour doll @NabhaNatesh aces the 'Charlie Chaplin' look. A charming cosplay indeed. #CharlieChaplin #NabhaNatesh pic.twitter.com/9aCEnQKQb1
— BA Raju's Team (@baraju_SuperHit) September 30, 2021
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని