Nabha Natesh | ‘జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు సహజం. కుదుపులు లేకుండా ప్రయాణం సాగదు. నా జీవితంలో పెద్ద కుదుపు ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్. దాని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా.’ అంటున్నది అందాలభామ నభా నటేష్. నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాలభామకు సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో, డార్లింగ్ సినిమాల రూపంలో పరాజయాలు పలకరించాయి.
ఈ బాధ నుంచి తేరుకునే లోపే పుండుకు పుల్ల మొగుడు అన్న చందాన.. నభా నటేష్‌కు యాక్సిడెంట్ అయ్యింది. సర్జరీలు కూడా జరిగాయి. దాంతో ఓ ఏడాదిపాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం నభా తేరుకున్నది. ప్రస్తుతం నిఖిల్‌తో ‘స్వయంభూ’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నది. ఇటీవల జిమ్‌లో తాను వర్కవుట్ చేస్తున్న ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి, కామెంట్‌ని కూడా జత చేసింది నభా. ‘యాక్సిడెంట్ తర్వాత, తిరిగి మామూలు స్థితికి రావడానికి చాలా శ్రమించా.
ఆ క్షణంలోమానసికంగా ఎంతో బాధ అనుభవించా. ఫిట్నెస్ కోసం శ్రమించా. ఇప్పుడు నా శరీరంపై నాకు అవగాహన పెరిగింది. మొబిలిటీ ఎక్సర్సైజ్లు, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ చేయడానికి ఇష్టపడుతున్నా. నటిగా ఉన్నప్పుడు తప్పదు కాబట్టి వ్యాయామం చేశా. ఇప్పుడు తప్పనిసరిగా వ్యాయామంచేస్తున్నా. ఈ యాక్సిడెంట్ వల్ల వర్కవుట్స్ విషయంలో నా ఆలోచనాధోరణి మారింది.’ అని చెప్పుకొచ్చింది నభానటేష్.