‘ఇందులో నాది చాలెంజింగ్ రోల్. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. స్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న అమ్మాయిగా ఇందులో కనిపిస్తా. దర్శకుడు అశ్విన్‌రామ్ కథ చెప్పినప్పుడు ఎక్సయిటింగ్ అనిపించింది. ఇలాంటి విభిన్నమైన పాత్ర దొరకడం నా అదృష్టం.’ అంటూ అందాలభామ నభానటేష్ ఆనందం వెలిబుచ్చింది. ప్రియదర్శికి జోడీగా ఆమె నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్‌రామ్ దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మాతలు.
ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా శనివారం విలేకరులతో ముచ్చటించింది. ‘యాక్సిడెంట్ వల్ల భుజానికి గాయమై రెండేళ్లుగా సినిమాలు చేయలేకపోయా. ఆడియన్స్‌కి నా ఎనర్జీ ఇష్టం. మళ్లీ మునుపటి ఎనర్జీతోనే రావాలని ఇంత టైమ్ తీసుకున్నా. సరైన సినిమాతో కమ్‌బ్యాక్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ‘డార్లింగ్’లో ఫన్‌తో పాటు ప్రేమ, కుటుంబ ఉద్వేగాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఉంటాయి.’ అని తెలిపింది నభా నటేశ్.
‘ఇందులో రెండు డిఫరెంట్ రోల్స్ చేయాలి. అందుకోసం చాలా హోంవర్క్ చేశా. స్లిట్ పర్సనాలిటీ సినిమాలు చాలా చూశా. ఆ కష్టం రేపు స్క్రీన్‌పై చూస్తారు. ప్రియదర్శితో కలిసి నటించడం చాలా బావుంది. మా కెమిస్ట్రీ అద్భుతంగా పడింది. నా యాక్షన్‌కి ప్రియదర్శి రియాక్షన్ సూపర్. తన కామెడీ టైమింగ్ నాచురల్‌గా ఉంటుంది. అలాగే, దర్శకుడు ఈ కథను మలిచిన తీరు, నిర్మాతల రాజీలేని తనం. వివేక్‌సాగర్ మ్యూజిక్.. ఇవన్నీ ఈ సినిమాకు ఎస్సెట్స్.’ అని నభానటేశ్ పేర్కొన్నది.