సాధారణంగా సినిమాలు తెల్లవారు జామున లేదా ఉదయం ఆటలతో మొదలవుతాయి. కానీ అందుకు భిన్నంగా శర్వానంద్ తాజా చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5: 49 నిమిషాలకు ప్రీమియర్ షోలతో ప్రారంభం కాబోతున్నది. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ చూడని విధంగా సాయంత్రం రిలీజ్‌ను ఎంచుకోవడం విశేషం. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
సంయుక్త, సాక్షివైద్య కథానాయికలు. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా మంగళవారం మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, ముక్కోణపు ప్రేమకథగా చక్కటి వినోదంతో అలరిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, కథ: భాను భోగవరపు, నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.