బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది టాప్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). ఈ సంస్థ నుంచి వస్తున్న రెండు భారీ చిత్రాలు వీరసింహారెడ్డి (Veera Simha Reddy), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). ఈ రెండు సినిమాలు సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ టీం డైరెక్టర్లతో కలిసి చెన్నైకి వెళ్లింది. ఇంతకీ దేనికోసమనుకుంటున్నారా..? వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం టీం చెన్నైలో ల్యాండ్ అయింది.
ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్, స్టార్ డైరెక్టర్లు గోపీచంద్ మలినేని, బాబీతో కలిసి దిగిన స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ రెండు భారీ చిత్రాల్లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండటం విశేషం. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్యలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. బాబీ సింహా, రాజేంద్రప్రసాద్, ప్రదీప్ రావత్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, కేథరిన్ థ్రెసా కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా బాస్ పార్టీ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.
మరోవైపు బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో ధునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, రవిశంకర్, చంద్రికా రవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Producer #RaviShankar garu, directors @megopichand Garu and @dirbobby Garu flying off to Chennai to complete the post production formalities of #VeeraSimhaReddy & #WaltairVeerayya 💥🔥#VeeraSimhaReddyOnJan12th #WaltairVeerayyaOnJan13th pic.twitter.com/sIWHc2t1nL
— Mythri Movie Makers (@MythriOfficial) January 3, 2023