త్వరలో 265 ఏఈఈ పోస్టుల భర్తీ : వెంకట్‌రెడ్డి
రోడ్లు, భవనాల శాఖలో ఖాళీగా ఉన్న 265 ఏఈఈ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే శాఖలో వివిధ హోదాల్లో పనిచేసే ఇంజినీర్లకు ప్రమోషన్లు కల్పించనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): రోడ్లు, భవనాల శాఖలో ఖాళీగా ఉన్న 265 ఏఈఈ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే శాఖలో వివిధ హోదాల్లో పనిచేసే ఇంజినీర్లకు ప్రమోషన్లు కల్పించనున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగులు రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో ఉండే ఏఈలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని, ఉద్యోగుల కోరిక మేరకు ఈ ఏడాది అన్ని హంగులతో కూడిన ఆడిటోరియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.11,399 కోట్ల ప్రతిపాదిత హ్యామ్ ప్రాజక్టును ఓ కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని, దీనిపై త్వరలో సీఎంను కలిసి చర్చించనున్నట్టు తెలిపారు. ట్రిపుల్ ఆర్కు అనుసంధానంగా గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ కాలేజీలు సహా టిమ్స్, నిమ్స్, ఉస్మానియా దవాఖానలు, హైకోర్టు, జిల్లా కోర్టులు, కలెక్టరేట్లలో నిర్మాణ పనులతోపాటు రూ.60 వేల కోట్ల విలువైన రోడ్లు నిర్మిస్తామని వివరించారు. ఇందులో డబుల్ లేన్, ఫోర్ లేన్, 6 లేన్ రోడ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

