జితేంద్ర జోషి కథానాయకుడిగా, రవీంద్రవిజయ్ కార్మార్కర్ దర్శకత్వంలో రాజుసత్యం రూపొందిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’ అదే పేరుతో తెలుగులో జనవరి 1న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్, మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
అరుణ్ సహకారంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేశామని, తెలుగులోనూ సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత రాజు సత్యం ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నచ్చే సినిమా ఇదని హీరో జితేంద్ర జోషి నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు.