అబిద్ భూషణ్, రోహిత్ సహాని, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకుడు. జయ్ వల్లందాస్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదలకానుంది.
సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ కథాంశమిదని, సినిమాలోని ప్రతీ పాత్ర మిస్టీరియస్‌గా కనిపిస్తుందని దర్శకుడు తెలిపారు. త్వరలో పాటల్ని విడుదల చేస్తామని, రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి పాటలు, సంగీతం: ఎమ్ఎల్ రాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి.