‘ఇప్పటివరకు రానటువంటి వినూత్న కథాంశంతో ‘జపాన్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం చక్కటి వినోదంతో పాటు ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది’ అని చెప్పింది అనూ ఇమ్మాన్యుయెల్. ఈ భామ కార్తి సరసన కథానాయికగా నటించిన ‘జపాన్’ చిత్రం ఈ నెల 10న విడుదలకానుంది. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు.
ఈ సందర్భంగా అనూ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ‘ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎక్సైయిటింగ్గా అనిపించింది. ఇలాంటి కథను గతంలో ఎప్పుడూ వినలేదు. ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కార్తి వంటి గొప్ప స్టార్‌తో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. సెట్లో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా.
ప్రతీ విషయంలో తన కోస్టార్స్కు మద్దతుగా నిలుస్తారు. ఈ దీపావళి సీజన్‌కు పర్ఫెర్ట్ మూవీగా ‘జపాన్’ చిత్రాన్ని చెప్పొచ్చు. నా పాత్రలో కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అవేమిటో సినిమా చూస్తే తెలుసుకోవాలి. నటిగా డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలనుకుంటున్నా’ అని చెప్పింది.