Jawan | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం ‘జవాన్’ (Jawan). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. జవాన్ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోలు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్ ఖాన్ అభిమానులు, నెటిజన్లతో కలిసి #AskSRK సెషన్లో పాల్గొన్నాడు.
జవాన్‌లో మీ లుక్ చూసి నా కొడుకు చాలా భయపడ్డాడు.. అని ఓ నెటిజన్ షారుఖ్‌కు ట్యాగ్ చేశాడు. దీనికి షారుఖ్ క్షమించండి.. సినిమా భయపడేంతలా ఏమీ ఉండదు. ఎప్పుడైనా అతనికి చూపించొచ్చు.. అని సూచించాడు. జవాన్ పాత్ర కోసం మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకునేందుకు సినిమాలేమైనా చూశారా..? అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ.. అట్లీ డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు చూశా. ప్రపంచం భాష వ్యక్తీకరణను అర్థం చేసుకోవడానికి విజయ్ సార్, అల్లు అర్జున్ జీ, రజినీ సార్, యశ్‌తోపాటు ఇతర స్టార్ హీరోల సినిమాలు చూశా. ఆ తర్వాత నా స్టైల్లో జవాన్ రోల్‌కు ప్రిపేర్ అయ్యానని చెప్పాడు.
సినిమాకు మీరిచ్చే నిర్వచనమేంటి..? మరో అభిమాని అడుగగా..ప్రజల సంక్షేమం కోసం వారిలో మార్పు తీసుకువస్తూ.. ఎక్కువ మందికి వినోదాన్ని అందించేదే సినిమా.. అని చెప్పాడు బాలీవుడ్ బాద్ షా. వర్క్‌లో తిరిగి జాయిన్ కావాలి. జవాన్ విడుదలకు రెడీ అవుతోంది. #AskSRK కోసం మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. ముందుగా వాగ్దానం చేసినట్టుగా ఈ సినిమా పోస్టర్‌ను లాంఛ్ చేస్తున్నా. థియేటర్లలో కలుద్దాం.. అని సెషన్‌ను ముగించాడు షారుఖ్ ఖాన్.
జవాన్ ట్రైలర్లో షారుక్ ఖాన్ కిల్లింగ్ యాక్టింగ్‌తో ఇరగదీశాడని, ఇంటెన్స్ యాక్షన్ పార్టు, స్టన్నింగ్ విజువల్స్‌తో సాగే ట్రైలర్ 2 నిమిషాల 15 సెకన్లు ఉంటుందని బీటౌన్ మీడియాలో అప్డేట్స్ రౌండప్ చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో తండ్రి, కొడుకుగా డ్యుయల్ రోల్లో కనిపించనున్నాడు. జవాన్‌లో నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరవబోతుంది.
@iamsrk literally my boy is scared of these looks still will manage to watch it. 👑 #AskSRK pic.twitter.com/hEjkH5kN9p
— Syed Tafazul Pirzada (@syed_tafazul) July 13, 2023
I watched a lot of films of Atlee. Vijay sir. Allu Arjun ji. Rajni sir. Yash and loads of other stars to understand the language of expression for the world that was being created. And yes then prepped for my own character too. #Jawan https://t.co/F23f2YY2sU
— Shah Rukh Khan (@iamsrk) July 13, 2023
Now have to go back to work. #Jawan getting release ready. Thank u for your time for #AskSRK. As promised sending out the poster for the film and of course lots and lots of love. See u all in the cinemas. pic.twitter.com/36w4j1JI1k
— Shah Rukh Khan (@iamsrk) July 13, 2023
జవాన్ ట్రైలర్..
జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ..