రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘మటన్ సూప్’. ‘విట్నెస్ ది రియల్ క్రైమ్’ అనేది ఉపశీర్షిక. రామచంద్ర వట్టికూటి దర్శకుడు. మల్లికార్జున ఎలికా(గోపాల్), అరుణ్‌చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
అగ్ర నిర్మాత కె.ఎస్.రామారావు పోస్టర్ని ఆవిష్కరించి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఇష్టంతో కష్టపడి ఈ సినిమా చేస్తున్నామని, ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నామని హీరో రమణ్ అన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేశామని త్వరలోనే విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఇంకా దర్శకుడు రామచంద్ర వట్టికూటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, లైన్ ప్రొడ్యూసర్ కొమ్మా రామకృష్ణ, ఎడిటర్ లోకేష్ కడలి కూడా మాట్లాడారు.