Mutton Soup Movie | డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘మటన్ సూప్’. రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను దక్కించుకుంది. అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ బ్యానర్లపై మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల ఈ చిత్రాన్ని నిర్మించారు. రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్ వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
సాధారణంగా చిన్న సినిమాలకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో, ‘మటన్ సూప్’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి స్పందనను అందుకుంది. ఆ వారం విడుదలైన చిత్రాల్లో ఈ సినిమాకు మంచి ‘టాక్’ రావడం విశేషం. రొటీన్‌కు భిన్నంగా నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని, ఊహించని మలుపులు, ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు రామచంద్ర వట్టికూటి సినిమాను తీర్చిదిద్దిన విధానంపై సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. సినిమాలోని ప్రధాన అంశం చాలా వైవిధ్యంగా ఉందని అభినందించారు.
చాలా తక్కువ బడ్జెట్లోనే నాణ్యత ఎక్కడా తగ్గకుండా రూపొందించిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మటన్ సూప్’ విజయంతో ఉత్సాహంగా ఉన్న దర్శకుడు రామచంద్ర వట్టికూటి ప్రస్తుతం మరో వైవిధ్యమైన కంటెంట్‌తో తన తర్వాతి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఈ కొత్త చిత్రం గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.