Mrinal Thakur | తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్‌నిచ్చిన మరాఠీ సుందరి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. అక్కడ నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వాటిలో అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ నిర్మిస్తున్న సినిమాపై మృణాల్ ఠాకూర్ ఎన్నో ఆశల్ని పెట్టుకుంది. సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్లో ప్రేమకథా చిత్రాల్ని అద్భుత రీతిలో తెరకెక్కిస్తుంటారు సంజయ్‌లీలా భన్సాలీ.
దాంతో ఈ సినిమా తన బాలీవుడ్ కెరీర్‌కు బ్రేక్‌నిస్తుందనే నమ్మకంతో ఉంది మృణాల్. తాజాగా ఈ సినిమాకు ‘తూ హీ హో..’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో నాయకానాయికలు సిద్ధార్థ్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ మ్యూజిషియన్స్‌గా కనిపిస్తారని, మనసుల్ని కదిలించే సంగీతభరిత ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని సుందరమైన లొకేషన్లలో తదుపరి షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ తెలిపారు.