అజయ్‌ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్షాప్ మూర్తి’. శివ పాలడుగు దర్శకుడు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. మధ్యతరగతి తాలూకు కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆకట్టుకుంది.
కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదనే అంశాన్ని చర్చిస్తూ సందేశాత్మకంగా సాగింది. ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాలను మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డి.జె.టిల్లు చిత్రాలను పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటైర్టెన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ బెజుగం, సంగీతం: పవన్.