Green India Challenger | రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్ జీహెచ్ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ అవసరాల పేరుతో చెట్లను నరుకుతూపోతే చివరికి మనిషి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు.
ప్రకృతి మనకు దేవుడు ఇచ్చిన వరమని, ప్రకృతి బాగున్నప్పుడే ఈ నేలపై మనం జీవించగలుగుతామన్నారు. మనం బ్రతకాలంటే చెట్లు కావాలని, చెట్లు కావాలంటే గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటాలన్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అత్యంత ప్రేమతో కొనసాగిస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, అందుకు తనవంతుగా నా శిష్యుడు తమన్‌కు, తనయుడు మహతీ స్వరసాగర్‌కు చాలెంజ్ విసురుతున్నట్లు పేర్కొన్నారు.