‘ఈ సినిమాకు నేనిచ్చిన సంగీతానికి ప్రేరణ కార్తీక్ ఘట్టమనేని చెప్పిన కథే. గొప్ప కథ రాసుకొని, దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తీశారాయన. ఈ సినిమా ఫస్ట్ షో పడ్డ దగ్గర్నుంచీ నా ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది. నా మ్యూజిక్‌ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది.’ అని సంగీత దర్శకుడు హరి గౌర అన్నారు. రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’కి ఈయన సంగీతం అందించారు. తేజ సజ్జా కథానాయకుడిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై విజయపథంలో దూసుకుపోతున్నది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు హరి గౌర సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కథని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ స్కోర్ రాశాను. రాములవారి పోర్షన్లో ఉండే ఎలిమెంట్స్‌ని పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడానికి పదిరోజులు పట్టింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా రావడానికి విభిన్నంగా ప్రయత్నించాను. తెరపై అవుట్‌పుట్ చూస్తే చెప్పలేని ఆనందం అనిపించింది’. అని తెలిపారు హరిగౌర. ‘వైబ్’ సాంగ్ సినిమా నుంచి తీసేయడం అనేది టీమ్ డెసిషన్ అనీ, సినిమాకు ఆ పాట అవసరం లేదని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే మరో నాలుగు సినిమాలు చేస్తున్నానని హరి గౌర తెలిపారు.