Ghantadi krishna | దర్శకుడిగా మారిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. వివరాలివే
తెలుగు ఇండస్ట్రీలో టాలెంటెడ్ సంగీత దర్శకులు చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు ఘంటాడి కృష్ణ (Ghantadi krishna). చాలా కాలంగా యాక్టివ్‌గా లేని ఘంటాడి కృష్ణ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వార్తల్లో నిలిచారు.
తమ సంగీతంతో మ్యూజిక్ లవర్స్‌ను అలరించే టాలెంటెడ్ సంగీత దర్శకులు తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు ఘంటాడి కృష్ణ (Ghantadi krishna). ఈయన కంపోజ్ చేసిన 6 టీన్స్, సంపంగి, జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమా పాటలు ఆల్‌టైమ్ ఫేవరేట్ హిట్ జాబితాలో ఉంటాయి. చాలా కాలంగా యాక్టివ్‌గా లేని ఘంటాడి కృష్ణ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. అయితే ఘంటాడి కృష్ణ ఈ సారి మాత్రం మ్యూజిక్ డైరెక్టర్‌గా కాకుండా దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.
ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి రిస్క్ (Risk) టైటిల్ ఫిక్స్ చేశారు. 2001లో వచ్చిన 6 టీన్స్‌కు ఇది సీక్వెల్ కావడం విశేషం. ఘంటాడి కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడమే కాకుండా..నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. జీకే మిరాకిల్స్ (GK Miracles) బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నాడు.
2001లో జీ నాగేశ్వర్ రెడ్డి (డెబ్యూ) దర్శకత్వంలో రోహిత్, రుతిక కాంబినేషన్లో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 6 టీన్స్. రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తుందంటే.. నయా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎలాంటి స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఘంటాడి కృష్ణకు ఈ సినిమా మంచి సక్సెస్ అందించాలని కోరుకుంటున్నారు సినీ జనాలు.
Vibe with this feel good Melody #SogasukeSoku from #Risk 🎶
A @KrishnaGantadi ‘s musical!
🎤 @sidsriramA film by Gantadi Krishna!
Starring @SandeepAshwa @sanya_thakurrr@adityamusic @RAMBABUVARMA #gkmiracles pic.twitter.com/TU6CgkbLuB— Aditya Music (@adityamusic) March 27, 2023
రిస్క్ నుంచి సొగసుకే సోకు సాంగ్..
A melodies first single from the film #RISK is on your way.
Promo on 22nd March!
Gantadi Krishna’s Musical 🎶 @KrishnaGantadi @SandeepAshwa@adityamusic @RAMBABUVARMA#gkmiracles #sandeepashwa #adityamusic #rambabuvarmalanka pic.twitter.com/gGn19sKwkq
— sandeep ashwa (@SandeepAshwa) March 21, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

