SRI DEVI| అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అందానికి అందం, మంచి నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన శ్రీదేవి అనూహ్యంగా 54 ఏళ్ల వయస్సులో కన్నుమూసారు. శ్రీదేవి మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అయితే శ్రీదేవి తెలుగులో కూడా మంచి సినిమాలు చేసింది. చిరంజీవి జోడీగా ఆమె నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతోనే ఆమెని అతిలోక సుందరి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
శ్రీదేవిని చాలా మంది దేవతలా ఆరాధిస్తారు. రామ్ గోపాల్ వర్మ లాంటి అభిమానులు అయితే పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుంటారు. అయితే శ్రీదేవి పెళ్లి అనేది చాలా విచిత్రంగా జరిగింది. అంత అందం స్టార్డమ్ ఉన్న శ్రీదేవి పెళ్లై పిల్లలు ఉన్న నిర్మాత భోనీకపూర్ తో జరిగింది. అయితే అంతకు ముందు శ్రీదేవిని ఓ స్టార్ హీరోకు ఇచ్చి పెళ్ళి చేయాలి అని ఆమె తల్లి భావించగా, ఆ హీరోని మాత్రం శ్రీదేవి చేసుకోలేదు. ఆ హీరో మరెవరో కాదు మురళీ మోహన్ . ఆయన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా శ్రీదేవితో పెళ్లికి ఎందుకు నో చెప్పాడు అనే విషయాన్ని వెల్లడించాడు.
మురళీ మోహన్ తన కెరియర్లో దాదాపు 400 వరకూ సినిమాల్లో నటించారు. నటుడిగా కొనసాగుతూనే బిజినెస్ మెన్ గా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అన్ని రంగాలలో సత్తా చాటారు. అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీదేవి తల్లికి నన్ను, నా పద్దతులను చూడగానే అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నారట. ఇదే విషయాన్నీ శ్రీదేవికి కూడా చెప్పి ఒప్పించారు కూడా. ఓసారి శ్రీదేవితో కలిసి ఆమె తల్లి మురళీమోహన్ ఇంటికి కూడా వచ్చారట.. అయితే అప్పుడు వారికి తెలిసింది ఏంటంటే అప్పటికే మురళీమోహన్ కు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం ఆమెకు తెలియక శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారట. అయితే తనకు పెళ్ళై పిల్లలున్నారని , కుదరదని చెప్పారట మురళీమోహన్. ఈ విషయాన్ని మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు.