Encounter specialist Daya Nayak | బాలీవుడ్ నటుడు.. పటౌడి వంశ వారసుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన లీలావతి దవాఖానకు తరలించారు. గాయలతో ఉన్న సైఫ్‌కి వైద్యులు సర్జరీ చేయగా.. విజయవంతగా పూర్తయినట్లు తెలిసింది. దీంతో సైఫ్ ప్రమాదం నుంచి బయటపడినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది.
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి దొంగలు ఫైర్ ఎస్కేప్ నిచ్చెనను ఉపయోగించారు. ఇది దోపిడీ ప్రయత్నం అని అనిపిస్తుంది. మేము దొంగలను అరెస్ట్ చేయడానికి పనిచేస్తున్నాం. ఈ కేసుపై 10 డిటెక్షన్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. అంటూ పోలీసులు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేసే బాధ్యతను క్రైం బ్రాంచ్‌లోని ప్రముఖ అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్‌కు అప్పగించింది ప్రభుత్వం. దీంతో బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంటిని క్రైమ్ బ్రాంచ్ అధికారులు దయా నాయక్ బృందం కలిసి పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఇంట్లోకి దొంగ ఎలా చొరబడ్డాడు? అనే అంశంతో పాటు సైఫ్‌పై దాడి చేసిన అనంతరం ఎలా తప్పించుకున్నాడు అనే కోణంలో దయా నాయక్ బృందం విచారణ జరుపబోతుంది.
దయా నాయక్ విషయానికి వస్తే.. క్రైం బ్రాంచ్‌లో పేరున్న అధికారుల్లో దయా ఒకరు. ముంబై అండర్ వరల్డ్ ను వణికించిన ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా దయాకు మంచి పేరుంది. నాయక్ రాష్ట్రంలోని ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) విభాగంలో మూడేళ్లుగా పనిచేశారు. అతను 1996లో జుహు పోలీస్ స్టేషన్లో పనిచేశాడు. అప్పటి నుంచి నగరంలో పేరుమోసిన అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌ను ఛేదించడంలో నాయక్ కీలక పాత్ర పోషించాడు. నివేదికల ప్రకారం దయా దాదాపు 80 మందిని ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. దయా నాయక్ జీవిత కథ స్ఫూర్తితో బాలీవుడ్ లో సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి వ్యక్తికి ఈ కేసును అప్పగించడంతో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది.
#WATCH Mumbai Police Officer Daya Nayak leaves from the residence of Actor Saif Ali Khan in Mumbai’s Bandra pic.twitter.com/bXcNk2MDEW
— ANI (@ANI) January 16, 2025
Also Read..