Salman Khan | రూ.2కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముంబయి పోలీసులు కేసు నమోదు చేరసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఓ సందేశం వచ్చింది. రూ.2కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులను.. ముంబయి బాంద్రా ప్రాంతంలో ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నెల ప్రారంభంలో రూ.5కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ డెస్క్‌కు బెదిరింపులు వచ్చాయి.
ఆ తర్వాత పోలీసులు జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇటీవల కొద్దికాలం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వస్తున్నాయి. అంతకుముందు గుర్తు తెలియని దుండగులు సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఆ తర్వాత సల్మాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత సిద్ధిఖీని హత్య చేయగా.. అది తమపనేనని లారెన్స్ గ్యాంగ్ ప్రకటించింది. ఆ తర్వాత జీషన్ సిద్ధిఖీకి సైతం బెదిరింపులు రాగా.. యూపీ నోయిడాకు చెందిన వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, సల్మాన్‌కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ సిద్ధిఖీ కుమారుడితో పాటు పలువురికి గ్యాంగ్ హెచ్చరికలు చేసింది.