Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటించిన చిత్రం డీజే టిల్లు బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు మూవీ లవర్స్ ఫోకస్ అంతా సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 (Tillu Square)పైనే ఉంది. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. 2022 ఆగస్టు చిత్రీకరణ షురూ చేసుకున్న ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 2023నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
కానీ ఈ సినిమా విడుదల విషయంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. పలు కారణాలతో మార్చి 2023 ఆ షెడ్యూల్ కాస్తా నవంబర్ 2023కి మారిపోయింది. ఈ నెలలోనైనా థియేటర్లలో టిల్లు సందడి ఉంటుందని అంతా అనుకుంటే.. మళ్లీ ఆ తేదీ కాస్తా 2024 ఫిబ్రవరి 9కి మారిపోయింది. ఇప్పుడు టిల్లు మరోసారి వాయిదా కష్టం వచ్చి పడ్డది. దీనిక్కారణం రవితేజ నటిస్తోన్న ఈగల్ సినిమానే. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈగల్‌ను జనవరి 13న విడుదల చేయాల్సింది.
కానీ సంక్రాంతికి వరుస సినిమాలున్న నేపథ్యంలో ఆదాయంపై ప్రభావం పడకూదనే ఉద్దేశంతో నిర్మాతలు ఈగల్‌ను టిల్లు స్క్వేర్ డేట్‌కు మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిద్దు జొన్నల గడ్డ సినిమాకు మరోసారి వాయిదా కష్టాలు షురూ అయ్యాయనే చెప్పాలి. తాజా పరిణామాల నేపథ్యంలో టిల్లు స్క్వేర్ను మరో తేదీన విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరి టిల్లు స్క్వేర్ కొత్త డేట్ ఎప్పుడనేదానిపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. సిద్దు జొన్నల గడ్డ ఈ సారి టిల్లు 2లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Attention Everybody! 🔊
Dropping a MAJOR update from our #TilluSquare tomorrow at 11:07am! 😎
Stay tuned & DON’T MISS IT! 🤩🕺#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios… pic.twitter.com/uhGDO8D5tK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2023
టికెటే కొనకుండా సాంగ్..
టికెటే కొనకుండా ప్రోమో..
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..