Mrunal Thakur | ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో చక్కటి అభినయంతో పాటు చూడముచ్చటైన రూపంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ భారీ చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నది. ఆమె నాని సరసన కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ ఆసక్తిని పెంచింది.
మంగళవారం మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు సందర్భంగా సరికొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మృణాల్ చిరునవ్వులు చిందిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సానుజాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాద్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, నిర్మాతలు: మోహన్ చెరుకూరి డాక్టర్ విజయేందర్ రెడ్డి, దర్శకత్వం: శౌర్యువ్.