ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య స్నేహాలు కామన్‌గానే కనిపిస్తాయి. అయితే, వాటిలోని ఎన్నో స్నేహాలు ఇద్దరూ కలిసి నటించడం వరకే కొనసాగుతాయి. ఆ తర్వాత అటకెక్కుతాయి. కానీ, తమన్నా భాటియాతో తన స్నేహం చిరస్థాయిగా నిలిచేదని అంటున్నది టాలీవుడ్ బ్యూటీ.. మృణాల్ ఠాకూర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. తమన్నాతో స్నేహం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. “నేను చిన్నప్పటి నుంచి అబ్బాయిలతోనే ఎక్కువగా ఉండేదాన్ని. అందుకే నాకు అమ్మాయిలతో స్నేహం చేయడం కొంచెం కష్టంగా అనిపించేది.
మారిపోయింది. ఈ క్రమంలోనే తమన్నా నాకు అత్యంత సన్నిహితురాలిగా మారింది” అంటూ చెప్పుకొచ్చింది. తమన్నా తనకు అత్యంత ఆత్మీయురాలనీ, ఆమె మనసు ఎంతో స్వచ్ఛమైనదనీ తమన్నాపై ప్రశంసలు కురిపించింది. “మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. ఏ విషయాన్నైనా ఆమెతో నిర్మొహమాటంగా పంచుకుంటాను. తను కూడా ఒక అక్కలా నాకు సలహాలు ఇస్తుంది. జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పిస్తుంది. ఆమె సలహాలు నాకు ఎంతో ధైర్యాన్నిస్తాయి” అంటూ వెల్లడించింది. గతంలో వీరిద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. అప్పటి నుంచే మృణాల్-తమన్నా మధ్య స్నేహం మరింత బలపడింది.